బద్ధకంతో అనర్థం

చిన్న వయసులోనే బద్దకానికి అలవాటు పడితే అనర్థం తప్పదంటున్నారు నిపుణులు. ఇల్లు కదలడానికైనా బద్ధకించే టీనేజర్లు గణనీయంగా కండర శక్తిని కోల్పోయి,  వయసు మళ్లిన వారిలా మారుతారని హెచ్చరిస్తున్నారు . టీనేజర్లు కేవలం రెండు వారాలు ఇల్లు కదలకుండా గడిపితే, వారికండర శక్తి యాభయ్యేళ్లకు పైబడ్డ నడివయస్కుల స్థాయికి దిగజారుతుందని కోపెన్హాగన్వర్సిటీ నిపుణులు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది.

యుక్త వయసుల్లో ఉన్న వారు బద్ధకంగా గడిపేస్తే,  దాదాపు మూడో వంతు కండర శక్తిని కోల్పోతారని, వయసు మళ్లిన వారు బద్ధకంగా రోజులు వెళ్లదీస్తే, నాలుగో వంతు కండర శక్తిని కోల్పోతారని ఈఅధ్యయనంలో  తేలింది. కండరాలు, ఎముకలు బలంగా పటిష్టంగా ఉండాలంటే బద్దకాన్ని వదులు కోక తప్పదని,  కాస్తంత వ్యాయామం ఉంటేతప్ప శరీరం అదుపులో ఉండదని కోపెన్హాగన్ని పుణులు వివరిస్తున్నారు.