నీటిపాచితో ఇంధన తయారీ

శైవలాలు ఉత్పత్తి చేసే స్వ్కేలన్‌(లిక్విడ్‌ హైడ్రోకార్బన్‌)తో ఇంధనాన్ని తయారుచేసే సరికొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో గ్యాసొలైన్‌ లేదా జెట్‌ ఇంధనాన్ని తయారుచేయవచ్చని వివరించారు. శైవలాలతో మురుగునీటిని శుభ్రపరిచే ప్రయత్నాల్లో ఈ విషయం వెల్లడైందని జపాన్‌ పరిశోధకులు తెలిపారు. ఈమేరకు నీటిపాచిగా వ్యవహరించే కొన్ని రకాల శైవలాలు చమురును ఉత్పత్తి చేయడం గమనించి వాటిపై పరిశోధన చేసినట్లు టొహోకు యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కెయిచీ టొమిషిగె, డాక్టర్‌ యోషినావొ నకగవా వివరించారు. మురుగునీటిని శుభ్రపరచడమే లక్ష్యంగా సాగిన ఈ పరిశోధనలో ఇంధన తయారీ విధానాన్ని కనుగొన్నామని చెప్పారు. ఇందులో సెరియం ఆక్సైడ్‌ సపోర్ట్‌తో రూపొందించిన కాటలి్‌స్టను, రుథెనియం లోహ కణాలను ఉపయోగించినట్లు నకగవా తెలిపారు.