మంచు కొండల్లో విందు భోజనం

వనాల్ల్లో  భోజనాలు  చేయడాన్ని  వన  బోజనాలు అని అంటారని మనకందరికీ తెలుసు.మరి మంచుకొండల్లో చేస్తే .?

ఆస్ట్రియా లోని  ఓట్జాల్  పర్వత  శ్రేణిలో ఉంటున్న ఈ హోటల్ లో భోజనం చేయడం మాత్రం వనభోజనాలకన్నా వంద రెట్లు ఉత్సాహాన్ని ఇస్తుంది.సముద్ర  మట్టానికి  3080  మీటర్ల  ఎత్తులో  ఉన్న విపరీతం గా మంచు కురిసే ఒబర్ గర్గ్ లో హోచ్ గర్గ్ ల్అనే ప్రాంతం లో ‘ ద మౌంటెయిన్ స్టార్ ‘ పేరుతో ఒక రెస్టారెంట్  ఉంది.మంచు దుప్పటి కప్పినట్టు కనిపించే ఎతైన తెల్లని పర్వతాలు ,అక్కడ వీచే గాలుల మధ్య రుచికరమైన భోజనాన్ని  ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రియులకోసం ప్రత్యేకంగా నిర్మించ బడింది .రోప్ వే లో మాత్రమే చేరుకోగలిగే ఈ మంచు విడిది లో ఈ సంవత్సరం  జూన్  26  నుండి  సెప్టెంబర్ 11 ప్రత్యక విందులు ఉంటాయట.వాలు కొండల్లో స్నో  స్కేటింగ్  చేసే అవకాశం ఉండటం ఇక్కడి ప్రత్యేకత…