తీపి పానీయాలతో మధుమేహం

తీపి పానీయాలతో మధుమేహం, కేన్సర్‌తో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించడం తెలిసిందే! ఇటీవల జరిగిన అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. బోస్టన్‌లోని టఫ్ట్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందంలో వెల్లడైన అంశాలు..

 • 1980లో ప్రపంచ వ్యాప్తంగా 51 దేశాలలో పరిశోధన ప్రారంభించారు.62 రకాల తీపి పానీయాలు.. వాటిని తాగే అలవాటున్న 6,11,971 మంది వలంటీర్లపై 2010 వరకు 30 సంవత్సరాల పాటూ పరిశోధన జరిగింది.187 దేశాలలో చక్కెర ఉత్పత్తి, వినియోగా నికి సంబంధించిన వివరాల పరిశీలన క్రింది  విధంగా  ఉంది

పరిశీలనలో వెల్లడైన వివరాలు

 • తీపి పానీయాల్లో చక్కెర నిల్వల శాతం చాలా ఎక్కువ
 • పావు లీటర్‌ తీపి పానీయంలోనే 50 కిలోకాలరీలు
 • వీటితో మధుమేహం, కేన్సర్లు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
 • తీపి పానీయాల కారణంగా(వివిధ వ్యాధులతో) ఏటా మరణించే వారి సంఖ్య 1.84 లక్షలు
 • 2010లో ప్రపంచ వ్యాప్తంగా..మధుమేహంతో మరణించిన వారి సంఖ్య 1.33 లక్షలు
 • గుండె జబ్బులతో 45000, కేన్సర్‌తో 6450
 • ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలలో తీపి పానీయాల వాడకం ఎక్కువగా ఉంది.
 • ఈ 20లో 8 లాటిన్‌ అమెరికా దేశాలే!
 • ప్రపంచ వ్యాప్తంగా మెక్సికోలోనే అత్యధిక మరణాలు..
 • మెక్సికన్లలో ప్రతీ 10 లక్షల మందికి 405 మంది మరణిస్తున్నారు. మొత్తం 24,000
 • అమెరికన్లలో ప్రతీ పది లక్షల మందిలో 125 మంది మరణిస్తున్నారు. మొత్తం 25,000.

తీపి పానీయాల వాడకం మూలంగావివిధ దేశాలలో మరణించే వారి శాతం

 • జపాన్‌లో 1 శాతం (65 ఆపై వయసున్న వారు)
 • మెక్సికోలో 30 శాతం (45 లేదా అంతకంటే తక్కువ వయసు)