సైలెంట్‌ ఫ్లయింగ్‌

గుడ్లగూబ రెక్కల నిర్మాణంలోని వైవిధ్యం వల్ల అవి ఎంత వేగంగా ఎగిరినా ఎలాంటి శబ్దం రాదు. ఈ లక్షణాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిశ్శబ్దంగా దూసుకెళ్లే విమానాన్ని తయారుచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. ప్లాస్టిక్‌ కోటింగ్‌ను అభివృద్ధి చేశారు. దీంతో శబ్ద తీవ్రతను సమర్థవంతంగా తగ్గించవచ్చని అన్నారు. అంటే విమానాల టేకాఫ్‌, లాండింగ్‌ సమయాల్లో వెలువడే శబ్దాల వల్ల కలిగే అసౌకర్యం తొలిగిపోతుందన్నమాట. విండ్‌ టర్బన్ల నుంచి వెలువడే శబ్దాలనూ దీంతో అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గుడ్లగూబ నిశ్శబ్దంగా ఎలా ఎగరగలుగుతోందనే విషయాన్ని తెలుసుకునేందుకు దాని రెక్కలను మైక్రోస్కోపీతో పరీక్షించగా.. వాటి రెక్కల నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుందని తేలిందన్నారు. ఈ ప్రత్యేక లక్షణం సాయంతో గుడ్లగూబ తన ఆహారం కోసం వేట కొనసాగిస్తుందని కేంబ్రిడ్జి వర్సిటీ ప్రొఫెసర్‌ నిగెల్‌ పీకే వివరించారు. ఈ పరిశీలనలో తెలుసుకున్న అంశాలతో ప్లాస్టిక్‌ పదార్థాన్ని త్రీడీలో ప్రింట్‌ చేశామని చెప్పారు. దీంతో శబ్దాల తీవ్రతను తగ్గించవచ్చని ప్రయోగాత్మకంగా వెల్లడైందని చెప్పారు.