రష్యా వ్యోమగామి సరికొత్త రికార్డు

అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యోమగామి గార ష్యాకు చెందిన గెన్న డీపడాల్కా (57)  రికార్డు  నెలకొల్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)  కమాండర్గానూ ఉన్న గెన్నడీ మొత్తం 803 రోజులు అంతరిక్షంలో గడిపి ఈరికార్డు నెలకొల్పారని రష్యాస్పేస్ ఏజెన్సీ తెలిపింది .  మాజీసోవియట్యూ నియన్కాలంలో సైనిక పైలట్గా శిక్షణ పొందిన గెన్నడీ  1998లో తొలిసారి అంతరిక్షంలోకి అడుగు పెట్టారు.  ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో తనఐదవ స్పేస్మిషన్లో కొనసాగుతున్న పడాల్కా ఈఏడాది సెప్టెంబర్లో భూమికి తిరిగి రానున్నారు.  అప్పటికి ఆయన అంతరిక్షంలో  877  రోజులు పూర్తి చేసుకోనున్నారు.  అంటే.. అప్పటికి దాదాపు రెండున్న రేళ్లపాటు ఆయన అంతరిక్షంలో గడిపినట్లవుతుంది.