పిస్తా మంచి నాస్తా

కాస్త ధర ఎక్కువే కానీ, అడపాదడపా చారెడంత పిస్తాపప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని చెబుతున్నారు నిపుణులు. ఫైబర్‌, ప్రొటీన్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండే పిస్తాను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే అని సెలవిస్తున్నారు. రోజులో పది పిస్తాపప్పుల వరకు ఆరగిస్తే ఆరోగ్యం మెరుగవుతుందంటున్నారు.

  • పిస్తాపప్పులో ఉండే విటమిన్‌-బి6 హిమోగ్లోబిన్‌ను పెంచడంలో దోహదం చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.
  •  చర్మ సౌందర్యం ఇనుమడింపజేయడంలోనూ పిస్తా మంచి గుణం కనబరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌-ఇ.. చర్మానికి కాంతి తేవడంతో పాటు యువి కిరణాలను తట్టుకునే సామర్థ్యం కలిగిస్తుంది. స్కిన్‌ క్యాన్సర్‌ను నిలువరించే శక్తి దీనికి ఉంది.
  • విటమిన్‌-ఎ,ఇ పాళ్లు పిస్తాలో ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని త్వరగా తగ్గిస్తాయి. నోరు పెచ్చడాన్ని పిస్తా త్వరగా అరికడుతుంది.
  •  ఒబెసిటీ నుంచి కూడా పిస్తా రిలీ్‌ఫనిస్తుంది. ఆకలిని అరికట్టడంతో పాటు శరీరంలోని కొలెసా్ట్రల్‌ శాతాన్ని తగ్గిస్తుంది. ఎముకలు, కండరాల దృఢత్వాన్నీ పెంచుతుంది.
  • జీర్ణక్రియలో పిస్తా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో సమృద్ధిగా ఉండే కాపర్‌, మ్యాంగనీస్‌, పాస్పరస్‌, థాయ్‌మైన్‌లు.. తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడతాయి.