పుట్టగొడుగులతో స్థూలకాయానికి చెక్

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో స్థూలకాయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. డైటింగ్, వ్యాయామాలు మొదలుకొని శస్త్రచికిత్సల వరకు స్థూలకాయులు నానా పద్ధతుల ద్వారా తమ శరీరంలోని అదనపు కొవ్వు తగ్గించుకునేందుకు తంటాలు పడుతుండటమూ తెలిసిందే. అయితే, పుట్టగొడుగులతో స్థూలకాయానికి చెక్ పెట్టవచ్చని తైవాన్ పరిశోధకులు చెబుతున్నారు.

పుట్టగొడుగుల నుంచి తయారు చేసే గానోడెర్మా లిసిడమ్ అనే పదార్థం శరీరంలోని అదనపు కొవ్వులను అద్భుతంగా కరిగించేస్తుందని వారు అంటున్నారు. చైనాలో  లింఘ్జీ  పేరిట విరివిగా వాడే ఈ పదార్థాన్ని ఎలుకలపై ప్రయోగించారు. వాటికి బాగా కొవ్వులతో నిండిన ఆహారాన్ని తినిపించారు. బాగా కొవ్వులు తీసుకున్నప్పటికీ వాటి బరువు పెరగకపోవడంతో ఈ నిర్ధారణకు వచ్చినట్లు తైవాన్ పరిశోధకులు చెబుతున్నారు.