పెసలు-స్పెషల్

ఆకుపచ్చ ముడి పెసలు షుగరు వ్యాధికి మేలుచేసేవిగా ఉంటాయి. ప్రొటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్‌, ఇంకా కొన్ని విటమిన్లు కలిగిన మంచి పోషక విలువలున్న ఆహర పదారం్థ ఇది. చైనాలో దీన్ని లుడౌ అని పిలుస్తారు, మనకన్నా చైనా వాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వేడిని తగ్గిస్తుందని దీన్ని వడదెబ్బ కొట్టినప్పుడు, చెమట కాయలు, దురదలు దద్దుర్లు వచ్చినప్పుడు వాడతారు. ఆహారంలో విష దోషాలు ఏర్పడినప్పుడు ఇది విరుగుడుగా పని చేస్తుందని చైనీయులకు ఒక నమ్మం. నీళ్ళ విరేచనాలు, రక్త విరేచనాలు పేగులకు సంబంధించిన వ్యాధులు, వైరస్‌ సంబంధిత వ్యాధులున్న వారికి పెసరతో వంటకాలు చేసి పెడతారు. ముఖ్యంగా కాలిన గాయాలతోనూ, ఎప్పటికీ మానని పుళ్ళతోనూ బాధపడ్తున్నవారికీ, ఆపరేషన్లు అయిన వారికీ చైనీయులు తప్పనిసరిగా పెసలు వండి పెడతారు. మనవాళ్ళు ఏ కారణంచేతో పెసరని చీము పట్టేదని దూరంగా ఉంచుతున్నారు. ఆయుర్వేద శాస్త్రం ఇలాంటి నిషేధాలేవి చెప్పలేదు. పైగా తప్పనిసరిగా వండి పెట్టాలని సూచించింది.