గోరింటాకు

గోరింటాకును గురించి తెలియని మహిళలే ఉండరు. స్త్రీల అలంకరణ సాధనాల్లో గోరింటాకు ఒకటి. గోరింటాకు ఎన్నో ఔషధగుణాలను కలిగిందని మన పూర్వీకులు దాన్ని అలంకరణకు ఉపయోగిస్తూ వచ్చారు.గోరింటాకు పెట్టుకుంటే అది మనిషిలోని లోపలి శక్తిని మేలుకొలిపి బయటి సూర్య శక్తితో అనుబంధం తెస్తుందని వేదాలు చెప్పినట్లు చెప్పబడింది. ఎందుకంటే బహూశ అందరికీ గోరింటాకులో ఉండే ఔషధ విలువలు తెలిసే ఉంటాయి.మానవ చర్మం మీదున్న కెరటిన్‌ అనే ఎంజైమ్‌ గోరింటాకులోని లాసోన్‌ అనే ఎంజైముతో కలవడం వలనే గోరింటాకు పెట్టుకుంటే చర్మం ఎర్రబడుతుంది……. పసుపు యొక్క ఔషధగుణాలను తెలుసుకున్న పశ్చిమ దేశాలు దానిని పేటెంట్‌ చేసేరు. ఈ మధ్య వారు (పశ్చిమ దేశస్తులు) గోరింటాకు యొక్క ఔషధగుణాలను తెలుసుకున్నారు గోరింటాకును వారుకూడా వాడుతున్నారు. గోరింటాకును కూడా వారు పేటంట్‌ చేసేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు…

ఔషధమూలిక గోరింటాకు:
గోరింటాకు అంటే అదేదో ఆడవాళ్ళకు సంబంధించిన విషయం అనుకోకండి. ఆయుర్వేద పరంగా గోరింటాకు ఒక ఔషధం. గోరింటాకును రుబ్బి గోర్లపై భాగంలో పెట్టుకోవడం వలన గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. అరిచేతిలోనూ, అరికాళ్ళలోనూ పెట్టుకోవడం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ శరీరంలో ఇతర భాగాలకు సంబంధించిన నాడులు ఉంటాయి. ఆయుర్వేదంలో కొన్ని పద్ధతుల ద్వారా గోరింటాకును శరీరంలోకి ఔషధంగా తీసుకోవడం వలన అల్సర్‌ మొదలైన రోగాలను నయం చేయడమే కాకుండా, పేగులను శుభ్రపరుస్తుందని ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. శరీరంలో వేడి బాగా పెరిగినప్పుడు గోరింటాకును అరికాళ్ళ నిండా పట్టించుకుంటే వేడి తగ్గిపోతుంది. మార్కెట్‌లో గోరింటాకుతో చేసిన నూనె దొరుకుతుంది. శరీరానికి గాయమై రక్తం కారుతున్న సమయంలో, కాసింత గోరింటనూనెను గాయమైన భాగం మీద రాస్తే కాసేపట్లోనే విడిపోయిన చర్మం కలిసిపోయి, గాయం అతి త్వరగా మనిపోతుంది.