పొడిచర్మానికి పొందికగా

పొడి చర్మం ఉన్నవాళ్లు స్నానం చేయగానే చర్మం బిగుసుకుపోయినట్టు అవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు…

 

  • ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని తేమగా ఉంచుకోవచ్చు.
  • స్నానం చేయగానే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. పొడిచర్మానికి క్రీమీగా ఉండే మాయిశ్చరైజర్‌ అయితే బాగా పనిచేస్తుంది.
  • స్నానానికి వెళ్లే ముందు ఆలివ్‌ ఆయిల్‌ లేదా కొబ్బరి నూనెతో చర్మాన్ని మర్దనా చేసుకోవాలి. ఇలా మర్దనా చేసుకున్న తరువాత చల్లని లేదా గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి.
  • కొన్ని చుక్కల ఆలివ్‌ ఆయిల్‌ వేసిన నీటితో స్నానం చేయడం ద్వారా చర్మం తేమ కోల్పోకుండా ఉంటుంది.
  • చిటికెడు పసుపు కలిపిన పాల మీగడను ప్రతిరోజూ ముఖానికి రాసుకోవాలి. తరువాత ముఖాన్ని శెనగపిండి లేదా సున్నిపిండితో కడుక్కోవాలి.
  • రాత్రి పూట నానబెట్టిన 4లేదా5 బాదం గింజల్ని పొద్దున్నే తొక్క వలిచి మెత్తగా చేసుకోవాలి. అందేలె కొన్ని పచ్చిపాలను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15నిమిషాల తరువాత కడుక్కోవాలి. చర్మ ఆరోగ్యానికి బాదం మంచి ఔషధంలా పనిచేస్తుంది.
  • తక్కువ నీటితో క్యారెట్‌ని ఉడికించి, అది చల్లారిన తరువాత మెత్తగా చేసుకొని ముఖానికి రాసుకోవాలి. సున్నితమైన పొడి చర్మానికి బాగా పనిచేస్తుంది.
  • కొన్ని చుక్కలు ఆలివ్‌ ఆయిల్‌ లేదా సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ వేసిన పచ్చిపాలల్లో దూది ముంచి చర్మాన్ని శుభ్రం చేయాలి. తరువాత చల్లని నీటితో చర్మాన్ని కడుక్కోవాలి.
  • తేనె సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్‌. తేనెలో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసుకొని చర్మానికి రాసుకోవాలి. పావుగంట తరువాత కడుక్కుంటే చర్మం సున్నితంగా ఉండడమేకాకుండా పొడి బారడం తగ్గుతుంది.
  • ఔషధగుణాలున్న కలబందని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం చల్లబడుతుది.. కూలెంట్‌లా పనిచేసే కలబంద గుజ్జులో, కొద్దిగాపసుపును కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మం ఆరోగ్యంగా, కాంతి వంతంగా  యారవుతుంది.