అనవసరం గా నీరు ఎక్కువుగా తాగితే

నీళ్లు ఎంత ఎక్కువ తాగితే ఆరోగ్యానికి అంత మంచిదని భావిస్తారు చాలామంది. కానీ ఇలా అతిగా నీళ్లు తాగటం కూడా ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లయోలా యూనివర్సిటీ మెడికల్సెంటర్కు చెందిన అంతర్జాతీయ నిపుణుల బృందంసూచనల ప్రకారం దాహంవేసి నప్పుడు మాత్రమే నీటిని తాగాలి. అవసరం లేకున్నా అధికంగా నీళ్లు తాగకూడదు. సాధారణంగా మనంతాగే నీటిని మూత్రపిండాలు వడపోస్తాయి. నీటిలో నివ్యర్థపదార్థాల్ని మూత్రం రూపంలో బయటకు పంపేస్తాయి. ఇలా మూత్రపిండాలకు కూడా ఒకస్థాయిలో పనిచేయగలిగే శక్తి ఉంటుంది.

కానీ అవసరానికి మించి నీళ్లను తాగడం వల్ల వాటిని మూత్రపిండాలు వడపోయలేవు. ఎక్కువ నీటిని వడపోసేక్రమంలో మూత్రపిండాలపై ఒత్తిడిపెరిగి, అవివాపునకు గురవుతాయి. శరీరంలో సోడియం స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా అనేక కణజాలాలు ఉబ్బిపోయి ప్రాణానికే హానికలగవచ్చు.  ముఖ్యంగా క్రీడాకారుల్లో ఈసమస్య ఎక్కువ తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే వారు గేమ్స్ప్రాక్టీస్చేసే సమయంలో అవసరం లేకున్నా అతిగా నీళ్లు తాగుతారు. ఇది ఎక్సర్సైజ్ అసోసియేటె డ్హైపోనాట్రీమియా  (ఈఏహచ్) కుదారితీస్తుంది. తలతిరగడం, వాంతులు, వికారం లాంటి లక్షణాలు ఈఏహచ్కు సూచనలు.

నీళ్లు తాగడం వల్ల అలసటను అధిగమించొచ్చని క్రీడాకారులు భావిస్తారు. చెమట ద్వారా కోల్పోయే నీటిని భర్తీ చేసేందుకు, ఆట ఆడే సమయంలో ఇతర సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కూడా నీటిని తీసుకుంటారు. దీని వల్ల ప్రయోజనంకంటే  నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు . సహజ సిద్ధంగా దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తీసుకోవాలని, ఇది క్రీడాకారుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారు చెబుతున్నారు.