క్రాన్‌బెర్రీ జ్యూసు గుండెకు మంచిది

తక్కువ క్యాలరీలుండే క్రాన్‌బెర్రీ జ్యూసు రోజుకు రెండుసార్లు తాగితే గుండెకు ఎంతో మంచిదట. దీన్ని రోజూ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్కు 10 శాతం, స్ర్టోక్..వచ్చే రిస్కు 15 శాతం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పండ్లను ఎక్కువ ఇష్టపడేవారు క్రాన్‌బెర్రీలను తప్పనిసరిగా తాము తినే పండ్ల జాబితాలో చేర్చాలని సూచిస్తున్నారు. తక్కువ క్యాలరీలు ఉన్న క్రాన్‌బెర్రీ జ్యూస్‌ వల్ల క్రానిక్‌ జబ్బులైన డయాబెటిస్‌, సో్ట్రక్‌, గుండెజబ్బుల తీవ్రతను తగ్గించవచ్చు. క్రాన్‌బెర్రీ్‌సలోని పోలిఫెనాల్స్‌ వంటి ప్రొటెక్టివ్‌ కాంపౌండ్స్‌ శరీరానికి ఎంతో మంచి చేస్తాయి. పోలిఫెనాల్స్‌శరీరం యొక్క సహజసిద్ధమైన రక్షణ వ్యవస్థను కాపాడతాయి. దీంతో ఆరోగ్యవంతమైన, సమతుల్యమైన జీవనశైలి అలవడుతుంది.శరీరారోగ్యం మెరుగుపడుతుంది. పోలిఫెనాల్స్‌ పుష్కలంగా ఉన్న క్రాన్‌బెర్రీ్‌సపై ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు ఒక అధ్యయనాన్ని కూడాచేపట్టారు. అందులో భాగంగా యునైటెడ్‌ స్టేట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ తోడ్పాటుతో 50 ఏళ్ల పైనున్న ఆరోగ్యవంతమైన 56మందికిఎనిమిదివారాలపాటు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. అధ్యయనం ప్రారంభంలో, ముగింపులో వీరిరక్తపోటు, బ్లడ్‌షుగర్‌, బ్లడ్‌ లిపిడ్స్‌, సి-రియాక్టివ్‌ ప్రొటీన్‌లను పరిశీలించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్నసభ్యుల్లో కొందరికి రోజుకు రెండు సార్లుతప్పనిసరిగా తక్కువ క్యాలరీలున్నక్రాన్‌బెర్రీ జూసునుఇచ్చారు. మరో గ్రూపు వారికి ప్లాసెబొ బెవరేజ్‌ని ఇచ్చారు. ఇది కూడా చూడడానికి క్రాన్‌బెర్రీ జ్యూసులాగ ఉండడమే కాదు దాని ఫ్లేవర్‌ సైతంక్రాన్‌బెర్రీనిపోలి ఉంటుంది. ఇంతకూ ఈ అధ్యయనంలో తేలిందేమిటంటే క్రాన్‌బెర్రీ జ్యూసు తాగినవారు ఆరోగ్యంగా ఉండడంతోపాటువారికి గుండెజబ్బుల రిస్కు 10 శాతం వరకు తగ్గింది. అలాగే స్ర్టోక్‌ రిస్కు కూడా 15 శాతం తగ్గింది. దీన్ని బట్టి అర్థమైన విషయమేమిటంటే పోలిఫెనాల్స్‌ మన శరీరాన్ని రక్షించడమే కాకుండా ఎన్నో జబ్బులు మన దరికి రాకుండా సంరక్షిస్తాయి.సో…మీరు కూడా ప్రతిరోజూ క్రాన్‌బె ర్రీ జ్యూస్‌ తాగండి…. ఆరోగ్యంగా ఉండండి.