300 ఏళ్ల ఖురాన్‌

ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌. దీనిలో 30 అధ్యాయాలుంటాయి. అలాంటి ఖురాన్‌ను మన మునివేళ్లలో ఇమిడిపోయేలా రూపొందించిన ఘనత మన పూర్వీకులకు దక్కుతుంది. మదనపల్లెలోని ఈస్ట్‌పేటకు చెందిన న జీర్‌ అహ్మద్‌కు ఇలాంటి ఒక చిట్టి గ్రంధం వారసత్వంగా లభించింది. ఈ ఖురాన్‌ పొడవు 5 సెంటీమీటర్లు, వెడల్పు 3.5 సెంటీమీటర్లు. ఈ చిట్టి ఖురాన్‌ను దాదాపు 300 సంవత్సరాల కిందట రూపొందించారని ఒక అంచనా. మూడు శతాబ్దాలయిన ఈ గ్రంథంలో అక్షరాలేమీ చెక్కుచెదరలేదు. నజీర్‌ అహ్మద్‌ ఏడాదంతా ఈ గ్రంఽథాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తారు. పవిత్ర రంజాన్‌ మాసంలో అందరి దర్శనార్థం అందుబాటులో ఉంచుతారు. పవిత్ర గ్రంథాన్ని వారసత్వ సంపదగా కాపాడుతున్నామని, భవిష్యత్‌ తరాలకు కూడా అందుబాటులో ఉంచుతామంటున్నారు నజీర్‌ అహ్మద్‌.