2 లక్షల కోట్ల రూపాయలు దానం చేసేస్తాడట!

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన సౌదీ యువరాజు అల్వలీద్‌ బిన్‌ తలాల్‌.. తన యావదాస్తిని దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇంతకీ ఆయన ఆస్తి ఎంతనుకుంటున్నారు. అక్షరాల రూ.2లక్షల కోట్లు. బుధవారం ఆయన ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. ‘‘సాంస్కృతిక అవగాహన పెంపొందించడం, కమ్యూనిటీల అభివృద్ధి, యువత శక్తి సామర్థ్యాలు మెరుగుపరచడం, ప్రకృతి విపత్తులలో సహాయ కార్యక్రమాలు చేపట్టడం, మరింత ఉన్నతమైన ప్రపంచ నిర్మాణం కోసమే నేను నా ఆస్తినంతా దానం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని పేర్కొన్నారు. అయితే ఇప్పటికిప్పుడే తన ఆస్తిని విరాళంగా ఇవ్వబోనని.. నిర్దిష్ట ప్రణాళికను రూపొందించి దాని ప్రకారం ముందడుగు వేస్తానని పేర్కొన్నారు. దానికి ఎలాంటి కాలపరిమితి లేదని స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో చేపట్టే పలు కార్యక్రమాలు తన మరణానంతరం కూడా కొనసాగేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 23న మరణించిన సౌదీరాజు అబ్దుల్లా మేనల్లుడే ఈ తలాల్‌.