ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలేం. అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించిన పలుఅరబ్ దేశాలు

ఇజ్రాయెల్‌ రాజధానిగా ప్రస్తుత టెల్‌ అవీవ్‌ స్థానంలో జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టెల్‌ అవీవ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాల్సిందిగా అమెరికా విదేశాంగ శాఖను ట్రంప్‌ ఆదేశించారు. జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా అధికారికంగా గుర్తించేందుకు ఇదే సమయమని నేను నిర్ణయించానుఅని ట్రంప్‌ అన్నారు. ఈ పనిని అమెరికా ఎప్పుడో చేసి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ అంశంలో ఏదైనా చేయాలని గత అధ్యక్షులు చెప్పేవారు. కానీ వారు చేసిందేమీ లేదు. వాళ్లకు ధైర్యం లేకనో, మనసు మార్చుకోవడం వల్లనో నేను చెప్పలేనుఅని ట్రంప్‌ అన్నారు. ట్రంప్‌ నిర్ణయంపై పలు అరబ్‌ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్‌ చర్యతో మధ్య ప్రాచ్య దేశాల్లో ఉద్యమం రావొచ్చని ఆ దేశాధినేతలు హెచ్చరించారు. ట్రంప్‌ మాట్లాడుతూ జెరూసలేం మూడు గొప్ప మతాలకు (ముస్లింలు, క్రైస్తవులు, యూదులు) ప్రధాన కేంద్రం. గత ఏడు దశాబ్దాల్లో ఇజ్రాయెల్‌ ప్రజలు యూదులు, ముస్లింలు, క్రైస్తవులు కలసి జీవించే దేశాన్ని నిర్మించారు. ఇజ్రాయెల్‌పాలస్తీనా ఇరు దేశాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా శాంతి ఒప్పందం కుదరడంలో సాయమందించేందుకు కూడా అమెరికా కట్టుబడి ఉందిఅని తన ప్రసంగంలో పేర్కొన్నారు.