మోదీకి మెజారిటీవస్తే ఆర్టికల్‌ 370ని సమూలంగా మార్చే అవకాశం. సియం మెహబూబా ముఫ్తీ

ఆర్టికల్‌ 370పై జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్‌ 370ని కొనసాగించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం జమ్మూ కశ్మీర్‌ ప్రజలకు కల్పించిన ప్రత్యేక గౌరవమని దీనిని భారత ప్రభుత్వం కొనసాగించాలని ఆమె చెప్పారు. చర్చలు, పరస్పర విరుద్ధ భావాలే ప్రజాస్వామ్యానికి ఆయుపుపట్టు అని ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి 2019 ఎన్నికల్లో అనూహ్యమైన, ఆశ్చర్యకర మెజారిటీ లభిస్తే జమ్మూకశ్మీర్‌ చరిత్రను, ఆర్టికల్‌ 370ని సమూలంగా మార్చే అవకాశముందని అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని జమ్మూ కశ్మీర్‌ బీజేపీ అధికార ప్రతినిధి వీరేంద్ర గుప్త రెండు రోజుల కిందట డిమాండ్‌ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మొహబూబాబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.