యువశక్తి: యువ నాయకత్వం, కుల సమానత్వంపై సమావేశం

yuva2అనంతపురం జిల్లా నార్పల మండలంలో ఆదిశక్తి పీఠం ఆధ్వర్యంలో జరిగంది జరిగిన యువశక్తి సమావేశానికి 145 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన యువతీయువకులు హాజరయ్యారు. ముస్లిం, క్రైస్తవ యువతీయువకులు కూడా  మీటింగ్ లో పాల్గొన్నారు. సమాజంలో అన్ని రంగాల్లో కులసమానత్వ సాధన కోసం యువతకు అవసరమయ్యే జ్ఞానాన్ని, నైపుణ్యాలను అందించే లక్ష్యంతో యువశక్తి పనిచేస్తుంది. సమావేశంలో పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలపై అవగాహన పెంచుకున్నారు.

11మంది యువతీయువకులు యువ నాయకులుగా పనిచేసేందుకు స్వచ్చంధంగా ముందుకువచ్చారు. కులాన్ని ఎలా తిరస్కరించాలనే అంశంపై తమ ఇరుగు పొరుగు గ్రామాల్లో చైతన్యాన్ని తెస్తామని, వెనుకబడిన సామజిక వర్గాల వారిని బీదరికంలోకి నెట్టేసే కులాధిపత్యాన్ని అంతం చేసే పోరాటంలో తమలో ఐక్యతా భావాన్ని పెంచుకుంటామని యూత్ లీడర్స్ తో కలసి సమావేశానికి హాజరైన యువత తీర్మానించింది. మీటింగ్ లో పాల్గొన్న చాలామంది ఆదిశక్తి పీఠంలో సభ్యులుగా చేరారు. ఆదిశక్తి పీఠం గ్రామదేవత సాంప్రదాయానికి చెందిన బ్రాహ్మణేతర పూజరులది. గ్రామదేవత సంప్రదాయాలను రక్షించే కొరకు ప్రత్యేకమత హోదాను డిమాండ్ చేస్తున్న ఆదిశక్తి పీఠానికి సభ్యులు మద్దతు తెలిపారు.