టైమ్స్ ఆఫ్ ఇండియా కులాధిపత్య ప్రచారం

download

చాలామంది వార్తాపత్రికలు చదివేవారు కేవలం హెడ్ లైన్స్ చూస్తారే తప్ప లోపల విషయం ఏంటనేది వివరంగా చదవరు. అందుకే పత్రికలు ఒక్కోసారి  విషయానికి సంబంధం లేకుండా తమ అజెండాకు సరిపోయే హెడ్ లైన్స్ రాస్తుంటారు.ఇదే కోవలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక బ్రాహ్మణులు జన్యుపరంగా మేలైన వారన్న  భావాల్ని  దారుణమైన రూపంలో ప్రచారం చేసింది. తాము ప్రచురించే వార్తకు ఎటువంటి డేటా ఆధారాలు లేకుండా సంతానలేమి దంపతులు బ్రాహ్మణుల వీర్యం కోసమే ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్టు ప్రముఖంగా తన హెడ్ లైన్స్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసింది. కొంతమంది తెలుపు రంగున్న వారి వీర్యం, ఇంకొంతమంది ఐఐటి లేదా ఐఐఎం చదివిన దాతల వీర్యం కావాలని కోరినట్టు,  వీర్య దానం చేసేవారి కులం ఏంటో చెప్పాలని మరికొంతమంది అడిగినట్టు డాక్టర్స్ తెలియజేశారని ఆ ఆర్టికల్ లో ఉంది  . కానీ  ఆర్టికల్ లో అసలు విషయానికి విరుద్ధంగా బ్రాహ్మణుల వీర్యం సంతానం లేనివారు డిమాండ్ చేస్తున్నట్టు హెడ్ లైన్ గా పెట్టారు. దేనికైనా ఎక్కువ డిమాండ్ ఉందనే   భ్రమ  ప్రజల్లో  కల్పిస్తే   అదే మంచిదని   ప్రజలలొ  అనుకుంటారు అనే    వ్యాపార వ్యూహము  చాల పురాతనమైనది అందరికీ బాగా తెలుసు. అందుకే రాజకీయాలలో ప్రజాభిప్రాయం తమ వేపు మళ్ళించుకోడానికి ఎవరికీ వారు తామే  నెగ్గుతున్నత్తు  సర్వేలు విడుదల చేసుకుంటారు.  బ్రాహ్మణులు అగ్రకులం వారు  పుట్టుకతోనే గొప్ప సామర్ధ్యం గల  వారనే భావనను సమాజంలో సృష్టించడమే వారి వ్యూహమని స్పష్టమవుతుంది.