సామాజిక వాస్తవికత తెలియని రాజన్

 

RAJANభారత్ దేశంలో లైసెన్స్ రాజ్ పోయినా ఇన్స్పెక్టర్ రాజ్ ఉండడం వలన అభివృధికి ఆటంకంగా వుందని వ్యాపార, ఆర్బిఐ గవర్నర్ రఘురాంరాజన్ అన్నారు. ఇబ్బందులు లేకుండా ఉండే  రెగ్యులేటరీ వాతావరణాన్ని కల్పించాలని, సులభంగా ఫైనాన్స్ దొరకటం, ముదిపదర్దాలు కష్టం లేకుండా దొరికేలా చూడాలని  రఘురాంరాజన్ చెబుతున్నారు. కానీ మన దేశంలో సుజనా చౌదరి, అంబానీ, అదానీ, సుబ్బిరామి రెడ్డి  లాగ  కుల  రాజకీయ  బలం ద్వార వ్యాపారవేత్తలగా  ఎదిగిన  వారె  ఎక్కువ . వారిపై ఇన్స్పెక్టర్ రాజ్ ఉండదు. ఎటువంటి ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ ఉండదు. వారికి ఎలాంటి అర్హత లేకపోయినా భారీ మొత్తాల్లో బ్యాంకులు అప్పులు ఇస్తాయి. దేశ సహజవనరులు, ఖనిజాలను అతితక్కువ ధరకే వారు పొందుతారు. పన్నులు ఎగవేసి ఆ సొమ్మును విదేశాల్లో దాస్తారు. జలాలను కలుషితం చేసినా వారికి ఎలాంటి జరిమానాలు విధించరు .మరి ఏ విషయంపై రాజన్ మాట్లాడుతున్నారు?

రాజకీయ కుల   వ్యాపారులు  ఎక్కువ  మందికి ఉపాధి కల్పించే గొప్ప ఉత్పత్తులను, స్థిరమైన వ్యాపారాలను సృష్టించలేరు. రాజకీయ రికమండేషన్తో వచ్చే వనరులు, బ్యాంకు అప్పులపై ఆధారపడతారు. ఇన్స్పెక్టర్ రాజ్ మనదేశ మూలసమస్య కాదు . కేంద్రం రాజ్ – ఆదిపత్య కుల రాజ్ మన పేదరికంకు మూల కారణం.  రాష్ట్రాలు తమ స్తానిక పరిస్తితులకు  తగ్గటు నిబంధనులు, పాలనా వ్యవస్థ,  న్యాయ వ్యవస్థ  పెట్టుకోకుండా కేంద్రం అధికారం గుప్పిట్లో పెట్టుకోవడం అభివ్రుది లేకపోవడానికి  ఒక కారణం.   కుల ప్రబుత్వాలు అండ చూసికుని  వాతావరణ నిబంధనలు,   గిరిజన హక్కులు కాలరాసి వనరులు దోపిడీ చేస్తున్న  ఆధిపత్య వర్ఘాలు కూడా పేదరికానికి పెద్ద కారణం. సామాజిక వాస్తవికత తెలియని రాజన్ వంటి వారి ఆర్బిఐ గవర్నర్లగా ఉండడం కూడా ఒక సమస్యే.