కోదండరామిరెడ్డి: ప్రపంచీకరణకు వ్యతిరేకం కానీ టిజేఏసి మీటింగ్స్ మాత్రం విదేశాల్లోనే

kodandaతెరాసపార్టీకి ప్రత్యామ్నాయంగా టిజాక్ ను రాజకీయ పార్టీగా మార్చాలని టిజేఏసి ఛైర్మన్ కోదండరామిరెడ్డి కోరుకుంటున్నారు. టిజేఏసీ కార్యక్రమాల కమిటీ సమావేశం సందర్భంగా 22 రోజుల పాటు జరిగిన విదేశీ పర్యటనలో జరిగిన వివిధ భేటీల్లో పలువురు ఇదే విషయాన్ని సూచించినట్టు ఆయన చెబుతున్నారు. ప్రపంచీకరణ విధానాలకు భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రాష్ట్ర సాధన ఉద్యమం ప్రతిపాదించిందని, కానీ తెలంగాణ పాలకులు దానికి  బిన్నంగా  పాలిస్తున్నారు   అని విమర్శించారు. తెరాసకు ధీటుగా రెడ్డి సామాజికవర్గం ఆధ్వర్యంలో రాజకీయ పార్టీని కోదండరాం ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తుంది. అదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు మరోసారి ఆయన మాటల ఉచ్చులో పడకపోవచ్చు. ప్రస్తుతం కోదండరామిరెడ్డి ఆయన పనిచేసిన విశ్వవిద్యాలయం నుండే కొన్ని ఓట్లను కూడా  తెచ్చుకునే పరిస్తితులో లేరు