నకిలీ గణాంకాలతో వృద్ధి సృష్టించటం సాధ్యమా?

modi gdp

ఢిల్లీ పాలకుల్లో రోజు రోజుకీ అభద్రతాభావం పెరిగిపోతుండటంతో నకిలీ గణాంకాలతో జిమ్మిక్కులు చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని బలపరుస్తూ భారతదేశ నకిలీ వృద్ధి గణాంకాలను ప్రశ్నిస్తూ అంతర్జాతీయ ఫైనాన్సియల్ ప్రెస్ లో ఈ వారం పలు ఆర్టికల్స్ వచ్చాయి. ప్రభుత్వం ప్రచారం చేస్తున్న గణాంకాలకూ వాస్తవ జిడిపి(గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్)కి 50 శాతం కంటే ఎక్కువ వ్యత్యాసం ఉన్నట్టు ఫ్రెంచ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అయిన సొసైటీ జనరల్ నివేదికలో ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం జిడిపి వృద్ధి రేటు లెక్కించడానికి తెచ్చిన  కొత్త పద్దతిని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్  కూడా ప్రశ్నలు లేవనెత్తారు

ఒకవైపు జీడీపీ గణాంకాల్లో మోసాలు చేస్తుంటే మరోవైపు తీవ్రమైన నిరుద్యోగ సంక్షోభం సమస్యపై కూడా నకిలీ గణాంకాలతో కాలం గడిపేయాలి అని ప్రబుత్వం  చూస్తుంది . గ్రామీణ ప్రాంతాల్లో కేవలం, 1.7 శాతం, పట్టణ ప్రాంతాల్లో 3.4 శాతం మాత్రమే నిరుద్యోగం ఉన్నట్టు ఫిబ్రవరిలో చెప్పడంతో ప్రభుత్వ నకిలీ ఉపాధి గణాంకాలపై ఆరోపణలు వస్తున్నాయి. 5.4 శాతం నిరుద్యోగమున్న అమెరికాతో పోల్చుకుంటే ఇండియాలో చదువుకున్న ప్రతిఒక్కరికీ ఉద్యోగం లభిస్తున్నట్టు  భారత ప్రభుత్వం చెబుతున్నట్టు కనిపిస్తుంది. వాస్తవాలు చూసుకుంటే  ఉత్తర ప్రదేశ్ లో స్వీపర్, ఆఫీస్ బాయ్ ఉద్యోగాలకు లక్షలు అప్లికేషన్స్ వచ్చాయి  వేలమంది గ్రాడ్యుయేట్లతోపాటు పిహెచ్డి చేసినవారు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. నకిలీ డేటాతో ప్రజలను మభ్యపెట్టి  సమస్యలకు పరిష్కారం కొత్త రాష్ట్రాలను సృష్టించడం అని మభ్యబెట్టి ఇంకెన్నాళో  నేట్టుకురాలేరు.  బహుశా ఈ కారణంతోనే మోడీ రక్షణ రంగానికి అత్యధికంగా నిధులు మళ్లిస్తున్నారు. తమ అధికారాన్ని నిలుపుకునేందుకు అగ్రవర్ణాలు  ప్రజలపై సైన్యాన్ని తరచూ ఉపయోగించుకునే మార్గంలా ఉంది.