కంచె ఐలయ్య: మన సమస్య తెలుగు భాష కాదు,  పరాయి భాషల అధిపత్యం

kanchaప్రజలందరికీ ఇంగ్లిష్ మీడియంలోనే విద్య అందాలని, అందుకోసం సామాజిక ఉద్యమం రావాలని సామాజిక శాస్త్రవేత్త కంచె ఐలయ్య తరచూ చెబుతుంటారు. కానీ  మలేషియా, వియత్నాం. కంబోడియా మరియు యూరోపియన్ దేశాల్లో అందరూ తమ చదువును స్థానిక భాషల్లోనే పూర్తిచేస్తారు. ద్వితీయ భాషగా ఇంగ్లీష్ నేర్చుకుని చాలా బాగా మాట్లాడతారు.మనకన్నా బాగానే అభివ్రుది చెందారు వారు. వాస్తవానికి అసలు సమస్య తెలుగు భాష కాదు ,ప్రబుత్వ స్కూల్స్ లో  నైపుణ్యంగల ఇంగ్లీష్ టీచర్స్ కొరత  , మిన్న కులాలిని అణగ దోక్కేందుకు  కుటిల మనస్తత్వంతో ఇంగ్లీష్ లో ఉన్నత విధ్య పెట్టడం.  అగ్రకులాలు ఎలాగా  ప్రైవేటు స్కూల్స్కు  పోతారు కదా అని మిన్న కులాలు పోయే  ప్రభుత్వ ప్రాధమిక కళాశాలలు దారుణ పరిస్తితిలో ఉంచడం.  ముఖ్య మంత్రులు కూడా అరకోరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా ఉత్తరాది ఐఏఎస్  ఆఫీసర్స్ కు  రాష్ట్రంలో  ఉద్యాగాల కల్పించేందుకు రాష్ట్ర ప్రబుత్వం ఇంగ్లీష్  వాడటం.  మన ఆర్ధిక  పతనానికి కారణం తెలుగు కాదు  సంకుచిత కుల పాలన,  ఉత్తరాది  అధిపత్యం , అధికారంలో అసమానతలే. అసలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం కాదు నైపుణ్యంగల ఇంగ్లీష్ టీచర్స్ అవసరం .  ప్రస్తుతం గ్రామాలలో  ప్రబుత్వ  స్కూల్స్లో మంచి ఇంగ్లిష్ నేర్పే టీచర్స్ కొరత ఉంది.  అది ఇంగ్లీష్ మాధ్యమము  ప్రవేశ పెట్టడం  వలన తగ్గదు.. బిబిసి రిపోర్టు ప్రకారం సరైన టీచర్ ఉంటే 11 ఏళ్లలోపు బాలలను ఇంగ్లీష్ ద్వితీయ భాషగా కేవలం ఆరు నెలల్లోనే నిష్ణాతులు చేయవచ్చని చెప్పింది. ఆఫీసుల్లో ఉద్యోగాల చేసేందుకు అవసరమైన ఇంగ్లీష్ ను నేర్చుకునేందుకు సుమారు 1,765 గంటలు అవసరమని అంచనా. వారానికి కేవలం నాలుగు గంటలపాటు కృషి చేస్తే నాలుగేళ్లలో సాధ్యమవుతుంది.

కొరతను అధిగమించేందుకు మన పన్నులతో చదువుకుంటున్న కాలేజీ మరియు యూనివర్సిటీ విద్యార్ధులు    ప్రభుత్వ కళాశాలలో  రెండు ఏళ్ళు తప్పనిసరిగా  ఇంగ్లీష్ నేర్పే పనిచెయ్యాలి అని రూల్ పెట్టాలి. సింగపూర్,  ఇస్రాయిల్  వంటి దేశాలు  దేశాలలో  యువత  రెండు ఏళ్ళు సైన్యంలో తప్పనిసరిగా  పనిచెయ్యాలి అని రూలు పెట్టినంటే ఇది కూడా.  అగ్ర, నిమ్న కులాల బాలల మధ్య  అంతరాలను దూరం చెయ్యాలంటే అన్ని పరీక్షలు యూనివర్సిటీ కాలేజీ చదువులూ  కేవలం తెలుగు మాధ్యమంలోనే  ఉండాలే రూల్ పెట్టాలి . మన భాష తెలియని ప్రబుత్వ అధికారులను అడ్డుకోవడానికి  ఎటువంటి స్థానిక ఉద్యోగానికైనా తెలుగులోనే పరీక్షలు ఉండేలా తప్పనిసరి చేయాలి. అప్పుడు ఆంగ్ల ఆధిపత్య భావాలు పూర్తిగా తగ్గిపోతాయి. మన భాషను, మన రంగును అసహ్యించుకుంటూ ఇంగ్లీష్,  హిందీ, సంస్కృత ప్రజలకు పరాధీనులుగా ఉండాలని మనం ఎందుకు కోరుకోవాలి ?