మహిళా సమానత్వం గురించి కృషి చేస్తాన్నన సివిల్స్ టాపర్ టీనా దాబీ

tinaమనదేశంలో ఇప్పటికీ లింగ వివక్ష, కులాధిపత్యం రాజ్యమేలుతున్న సమయంలో టీనా దాబీ అనే అనే దళిత వర్ఘానికి చెందిన యువతి ఈ ఏడాది సివిల్స్ టాపర్ గా నిలవడం దళితులకు మహిళలకు  గర్వించదగ్గ విషయం. అగ్రకులంలోనే  ప్రతిభ ఉన్నటు మాట్లాడే  అవివేకులికి ,ఆడవాళ్ళు మను శాస్త్రం ప్రకారం ఇంటి పనులే చెయ్యాలి అన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అద్యక్షుడు మోహన్ సింగ్ భగవద్ లాంటి మూర్ఖులకు ఇది   చెంపదెబ్బ లాంటిది. విద్యావంతులైన తల్లిదండ్రులు, సంపన్నమైన కుటుంబాలు, వివిక్షలేకపోవడం, మంచి ప్రైవేటు స్కూల్స్ ఎక్కువ మార్కుల సాధనలో కీలకమైన అంశాలుగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే.  ఆదర్శంగా నిలుస్తున్న టీనా లాంటివారు అణగారిన వర్గాల వారికి ఆత్మవిశ్వాసం ఇవ్వడమే కాకుండా చారిత్రకంగా మెరిట్ తమ వర్ఘానికే  సొంతమనే ప్రచారాలు చేసే వారికి ఒక సవాలుగా నిలుస్తున్నారు. లింగ సమానత్వం కోసం కృషి చేస్తానని టీనా తెలిపారు. అందుకోసమే హర్యానా రాష్ట్రాన్ని తన కేడర్ గా ఎంచుకోవాలని భావిస్తున్నారు. హర్యానాలో మహిళలపై విపరీతమైన అణచివేత, పరువు హత్యలు ఎక్కువ. నిమ్న కులాల మహిళలకు ఆ రాష్ట్రంలో ఎప్పుడోగాని న్యాయం దొరకదు. హర్యానాలో  ఒక్కపటి ముఖ్య మంత్రి ఓం ప్రకాష్ చౌతాల మానభంగాలు ఆపాలంటే అమ్మాయిలకి త్వరగా పెళ్లిచేస్సయాలి అని సలహా ఇచ్చారు.  టినా డాబి హర్యనా రాష్ట్రం ఎన్నుకోవడం  చాల హర్షించ దగ్గ విషయం. అక్కడ ఆమె మహిళలకు  అణగారిన వర్ఘాలికి మద్దతునిస్తూ ఎంతో స్పూర్తి దాయకంగా ఉంటారు