బాబు గోగినేని పిచ్చిప్రశ్న: అగ్రకులాలను టార్గెట్ చేస్తే కుల అణచివేత ఎలా పోతుంది?

gogineniఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ చర్చలో బాబు గోనినేని మాట్లాడుతూ కులమనేది ఒక రోగం అది పోవాలంటే ప్రక్రియలు తెలుసుకోవాలి, అంతేకానీ అగ్రకులాలను టార్గెట్ చేస్తే కుల అణచివేత ఎలా పోతుందని తన సామాజిక వర్గానికే చెందిన రాధాకృష్ణను ప్రశ్నించారు. కులమనేది ఒక రోగమని ఆయన చెబుతుంటే ఏబిఎన్ రాధాకృష్ణ చిన్నగా నవ్వుకున్నారు. ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన గోగినేని తిరిగి ప్రశ్నించడం సబబేనా?.మరో కామెడీ ఏమంటే విదేశాల్లో కులం ఎలా పోయిందో తెలుసుకుని దాన్నే మనదేశంలో అమలు చేయాలని చెప్పారు. సామజిక మార్పు కావాలనే ఒక తాపత్రయం, ఉత్సాహం రుచి చూపిస్తే అప్పుడు మార్పు జరిగిపోతుందంటున్నారు. ఈ ఆ రుచి చూపించాలి అన్న తాపత్రయం లేనిది తమ వంటి ఆధిపత్య కులాలికేన లేదా  మొత్తం సమాజానికా?

కులం అనేది ఒక జబ్బుఅని అంటారు. అంబేద్కర్ ను దళిత వాడల నుండి బయటకు గుంజితే మంచిదని చెబుతున్న బాబు గోగినేని కమ్మవాడలు లేకుండా ఎన్టీఆర్ ఎందుకు గుంజ లేకపొతున్నారు  చర్చించలేదు. కమ్మ సామాజిక వర్గం వారు స్వచ్చందంగా తమ వాడల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు బదులు అంబేద్కర్ విగ్రహాలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని రాధాకృష్ణను అడగలేదు. వీరిద్దరి బాధ అంతా అధికారం, మీడియా అండతో ప్రజలను దోపిడీ చేస్తున్న అగ్రకులాలను నిమ్న కులాలువారు టార్గెట్ చేస్తున్నారు అన్నటు కనబడ్డాది. ఆ విషయంపైనే వీరిద్దరూ తెగ ఆందోళన చెందుతున్నట్టు మాత్రమే కనిపిస్తుంది.