అంబేద్కరిస్టు  అయినందుకు కాపు సామాజిక వర్గ అధికారిని టార్గెట్ చేసిన చంద్రబాబు

state_oppression_1

విజయనగరం జిల్లాలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న ఏనుగుల చైతన్యమురళిని అకారణంగా బదిలీ చేసి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచడంపై ఏపి రాష్ట్రవ్యాప్తంగా చర్చాంశనీయం అయింది.  ఉద్యోగ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తూ సామాజిక సేవ చేయడంలో చైతన్య మురళి ముందున్నారు. హాన్స్ ఇండియా, వి6 వంటి తెలుగు మీడియా సంస్థలు ఆయనపై ప్రశంసలు కురిపించాయి. చైతన్యమురళి బుద్ధుడుపై పుస్తకాలు రాసారు. అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు.  తన పిల్లలకు కాన్షీరాం, మాయావతి పేర్లు పెట్టుకున్నారు మురళి.  వారు సామాన్యులలాగా  పెరిగి తమ కాళ్లపై నిలబడి ఉన్నత స్థానాలకు ఎదగాలన్న కోరికతో  వారిని విజయనగరం మున్సిపల్ స్కూల్ కే పంపిస్తున్నారు. మురళి సామాజిక సేవలో భాగంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్, పేదవిద్యార్థులకు పుస్తకాలు అందించడం బౌద్ధ భావ జాలం ప్రచారం చెయ్యడం వంటి సామాజ సేవ కార్యక్రమాలు  చేశారు. జూన్ నెలాఖరులోగా మురళిని విధుల్లోకి తీసుకోకపోతే ఎక్ష్సైజ్ మంత్రి ఇంటిని ముట్టడిస్తామని ఏపి రాష్ట్ర మాల మహానాడు తీర్మానం చేసింది. నిబద్ధతగల ఉద్యోగైన మురళిపై చంద్రబాబు ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని సాటి ఉద్యోగులు, మాలమహానాడు, పలు అంబేద్కరైట్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

 

CBN, Ambedkarist