అమరావతిపై మోడీని నిలదీసిన ఐలయ్యపై ఆంధ్రజ్యోతి దుష్ప్రచారం

kanchaఇటీవల విజయవాడలో జరిగిన ఒక సెమినార్ లో కంచె ఐలయ్య ‘దేశభక్తి-భిన్న దృక్పధాలు’ అనే అంశంపై ప్రసంగించారు. అంతకుముందు ఏపి రాజధాని ప్రాంతంలో పర్యటించి అమరావతికి బుద్ధుడి పునాదులున్నాయని అందుకే మోడీ కొన్ని నదీజలాలు, ఇంత మట్టి తప్ప ఏపికి నిధులు ఇవ్వడం లేదన్నారు. ఐలయ్య మోడీని విమర్శించడం ఎల్లో మీడియాకు ఆగ్రహం తెప్పించింది. చంద్రబాబు వర్గానికి కరపత్రంలా మారిన ఎల్లో మీడియా బాబు-భాజపా సంబంధాలు తేడాకొడుతున్నసమయంలో మరింత దారుణంగా బరితెగిస్తున్నాయి. ఉత్పత్తి కులాలకు మతవిషయాల్లో సమానత్వం ఎందుకు లేకుండా పోయింది, ఉత్పత్తి రంగంలో బ్రాహ్మణులు పాత్రపై చర్చ జరగాలని ఐలయ్య ప్రసంగిస్తే బ్రాహ్మణులను తిని కూచుంటారాని, సోమరిపోతులని ఆయన అన్నట్టు తప్పుడు వార్తలు రాసి  ఆంధ్రజ్యోతి దుష్ప్రచారం చేసింది. దీనిపై ఐలయ్య స్పందిస్తూ ఆంధ్రజ్యోతి వార్తను ఖండించారు. నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసారు. బ్రాహ్మణిజాన్ని పరిశోధించి, తన జీవితానుభావాలను జోడించి దానిపై బలమైన, సహేతుకమైన విమర్శ చేస్తున్న ఐలయ్య ఒక వ్యక్తి కాదు, ఆయనో వ్యవస్థ విమర్శిస్తారు . ఎల్లో మీడియా ఎల్లప్పుడూ కుల అణచివేతకు ఒక సాధనంగా పనిచేస్తుంది. ఆంధ్రజ్యోతి బ్రాహ్మణ సంపాదకులు వామపక్ష ముసుగులో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి బలపరచారు. వారి అసలు రంగు మరోసారి బయటపడింది. తాము ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులమే తప్ప మరొకరం కాదని నిరూపించుకుంటున్నారు. బ్రాహ్మణులను కించపరచలేదని ఐలయ్య వివరణ ఇస్తే ఐలయ్య  క్షమాపణ చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారు.