రోబోటిక్ వాక్యుం క్లీనర్ తో జాగ్రత సుమా!

south korea robot vacuum cleaner

సౌత్ కొరియా లో ఒక  వింత ఘటన చోటు చేసుకుంది. చాంగ్వన్ సిటీ లో నివసిస్తున్న ఒక ఇంట్లో ఈ సంఘటన జరిగింది. రోబోల వల్ల మనకి చాలా సుఖవంతమైన జీవితం లభిస్తుంది. అవి మనం చేసే పనిని చాలా తొందరగా సులభం గా చేసేస్తాయి. ఏది చెప్తే ఆది వింటాయి, చేస్తాయి. కాని వాటికి మనకి ,వస్తువులకి తేడా తెలీదు. కాని అవే మనకి ఎదురు తిరిగితే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

చాంగ్వాన్ సిటీ లో ని ఒక ఇంట్లో ఆ ఇంటి యజమానురాలు తన ఇంట్లోని అవసరాలు తీర్చడానికి ఒక రోబోటిక్ వ్యాక్యుం క్లీనర్ ని తెచ్చుకునింది.ఆమె నేల మీద పడుకోని  ఆమె నిద్రపోతున్నపుడు జుట్టుని డస్ట్ గా భావించి వ్యాక్యుం క్లీనర్ తనలోనికి లాగేసుకుంది.దీని తో నిద్ర  లోనుంచి లేచి షాక్ కి గురైంది. ఎంతో కస్టపడి తీయాలని చూసినా వీలుకాలేదు. చివరికి ఫైర్ డిపార్టమెంట్ కి ఫోన్ చేసింది. దీనితో వారి దగ్గర ఉండే పరికరాలతో  చాల కష్టపడి విడదీసారు.

మారుతున్న కాలానికి తగ్గట్టు చాలా కంపెనీలు చాలా  రకాలుగా వివిధ సెన్సార్లను ఉపయోగించి రోబోటిక్ వ్యాక్యుం క్లీనర్స్ ని విడుదల చేస్తున్నాయి. వీటివాడకం కూడా  ఎక్కువగానే ఉంది. కాబట్టి మన జాగ్రతలో మనం ఉంటే అంతా మంచే జరుగుతుంది.