మార్స్ దగ్గరికి మేమూ వెళ్తాం…


అంగారకుడిపై ప్రయోగం అంటేనే ప్రపంచదేశాలు వెనకడుగు వేస్తాయి. ఎందుకంటే సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అసలు అంగాకర కక్ష్యలోకి ఉపగ్రహం వెళ్లాలంటేనే సవాలక్ష సమస్యలు అధిగమించాలి. ఇప్పటికే ఎన్నో దేశాలు విఫలమయ్యాయి కూడా. తొలి ప్రయత్నంలోనే భారత్ మంగల్యాన్ రూపంలో విజయాన్ని నమోదు చేసుకుంది. కిలోమీటర్ కు 10 రూపాయల అత్యంత తక్కువ ఖర్చుతోనే టార్గెట్ రీచ్ అయింది. ఈ పరిణామం చైనాకు చాలా చిన్నచూపుగా మారింది. కారణం 2011లో మార్స్ ప్రయోగం చేసి అది విఫలమైంది. ఇప్పుడు ఏకంగా 2020 నాటికి అంగారకుడిపైకి రోవర్ ను పంపేందుకు సిద్ధమవుతోంది. 2030 నాటికి దాన్ని తిరిగి భూమ్మీదకు తేవాలన్నది ఉద్దేశం. చంద్రుడిపై రోవర్ విజయవంతమైన నేపథ్యంలో డ్రాగన్ చైనా ఈ నిర్ణయం తీసుకుంది. విషయం ఏంటంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు… అసలు మార్స్ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడంలోనే ఫెయిల్ అయిన చైనా.. అంగారకుడిపైకి ఏకంగా రోవర్ ను పంపాలనుకోవడమే విడ్డూరానికి కారణం. మరి వారి ప్రయత్నాలు ఏమేరకు సఫలమవుతాయో చూడాల్సిందే.