బృహస్పతి ఉపగ్రహంపై ఏలియన్స్..! – నాసా


గ్రహాల్లోకెల్లా అతిపెద్దది గురుగ్రహం (జూపిటర్). భూమికి చంద్రుడు ఉపగ్రహంలా ఉన్నట్లే గురుగ్రహానికీ యూరోపా అనే ఉపగ్రహం ఉంది. ఇది బృహస్పతి చుట్టూ తిరుగుతూ తనచుట్టూ తాను తిరుగుతుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ యూరోపాపై గ్రహాంతరవాసులు ఉండొచ్చు అని నాసా అభిప్రాయం వ్యక్తం చేయడమే. ఏలియన్స్ ఇక్కడున్నారు.. అక్కడున్నారన్న ప్రచారం తప్పితే అసలు గ్రహాంతర వాసుల జాడలను ఎవరూ కనుగొనలేదు. తాజాగా జూపిటర్ ఉపగ్రహం యూరోపా వాతావరణ పరిస్థితులతో అక్కడ ఏలియన్స్ జాడలు ఉండే అవకాశం ఉందని నాసా చెబుతోంది. ఉపగ్రహంపై తెల్లగా కనిపిస్తున్న భాగం మంచురేఖలుగా అనుకుంటున్నారు. ఇది పూర్తి స్వచ్ఛమైన నీటితో ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. జూపిటర్ పై నాసా ప్రయోగించిన జునో ఉపగ్రహం అక్కడికి చేరితే ఈ ఏలియన్స్ గుట్టు రట్టయ్యే అవకాశాలున్నాయి.