కంటికి కనిపించని శక్తి భూమిని కాపాడుతోందా?


విశ్వంలో జీవం ఉన్న గ్రహం మన భూమి ఒక్కటే. ఇలా జీవం మనుగడ ఇక్కడ కొనసాగుతోందంటే.. ఎన్నో సహజసిద్ధమైన రక్షణ వలయాలు భూమండలం చుట్టూ ఉండడమే కారణం. అయస్కాంత క్షేత్రంతో గురుత్వాకర్షణ ఉండడం…, ఓజోన్ పొరతో అతినీల లోహిత కిరణాలు భూమిని చేరకుండా ఉండడం మనకు తెలిసిందే. తాజాగా.. భూ ఉపరితలం నుంచి 11 వేల కిలోమీటర్ల ఎత్తులో కంటికి కనిపించని ఓ పొర భూమిని రేడియేషన్ నుంచి కాపాడుతోందని మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు గుర్తించారు. ఈ తరహా పరిశోధనలో ఇదో ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.