ఇక స్మార్ట్ వాచీల శకం మొదలు

smart watchఇప్పటి వరకూ స్మార్ట్ ఫోన్లు, ఫ్యాబ్లాయిడ్స్, టాబ్లెట్స్ హవా కనిపించింది. వాచీల్లోనూ ఖరీదైనవి రకరకాల డిస్ ప్లేతో వచ్చినవి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడంతా స్మార్ట్ వాచీల హవా నడుస్తోంది. మామూలు వాచీలకు కాలం చెల్లిపోయేలా కనిపిస్తోంది. కారణం డిజటలైజేషన్ తో అత్యాధునిక హంగులతో 2015లో పలు కంపెనీలు స్మార్ట్ వాచీలను మార్కెట్లోకి తీసుకురాబోతున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, సామ్ సంగ్ స్మార్ట్ వాచీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాయి. తాజాగా ఏసస్ కంపెనీ కూడా స్మార్ట్ వాచీలపై ఆసక్తి చూపుతోంది. స్లైలిష్ గా కనిపిస్తోన్న పై ఫోటోలోని వాచీ అన్నీ కుదిరితే మార్చి 2015 నాటికి ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ధర రేంజ్ ను బట్టి రూ. 15000 నుంచి 22,000 వరకూ ఉండనుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ తో ఈ వాచీ హల్ చల్ చేయనుంది. 512 ర్యామ్, 4 జీబీ స్టోరేజీ దీని ప్రత్యేకత. స్మార్ట్ వాచీలతో పని మరింత స్మార్ట్ గా మారడం ఖాయమంటున్నారు.