మాజీ మంత్రి ఎల్లా రెడ్డి మృతి


తెరాస ముఖ్య నేత , మాజీ మంత్రి ఎల్లారెడ్డి మృతి చెందారు . ఆయన వయసు 75 సంవత్సరాలు . తన స్వగృహం లో అనుకోకుండా సృహ తప్పి పడిపోవడం తో ఆయన కుటుంబ సభ్యులు ఆయనని హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రి లో చేర్పించారు . మహబూబ్ నగర్ జుల్ల లోని వూట్కూరుకు చెందిన ఎల్లారెడ్డి జనతా పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించారు. టీడీపీలో చేరి 1988లో ఆ జిల్లా అధ్యక్షుడు అయ్యారు. 1994, 1999 ఎన్నికల్లో మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో చంద్రబాబునాయుడు కేబినెట్‌లో బీసీ సంక్షేమం, మార్కెటింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు. మొన్న జనరల్ ఎలక్షన్ కి ముందర తెలంగాణా వచ్చిన తరవాత తెరాస లో చేరిన ఆయన ముక్తల్ లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు .