లౌకికవాద పదం పెద్ద అబద్ధం. యూపి సిఎం ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లౌకికవాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మతతత్త్వం, లౌకకవాదం గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘లౌకికవాదం’ అనే పదం పెద్ద అబద్ధమని చెప్పారు. చరిత్రను వక్రీకరించడమంటే దేశ ద్రోహంతో సమానమని తెలిపారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పెద్ద అబద్ధం ఏమిటంటే ‘లౌకికవాదం’ అనే పదమేనని యోగి అన్నారు. ఈ పదాన్ని రూపొందించినవాళ్ళు, దాన్ని ఉపయోగించినవాళ్ళు క్షమాపణ చెప్పాలన్నారు. ఏ వ్యవస్థా లౌకికవాదంగలది కాదన్నారు. రాజకీయ వ్యవస్థలు వర్గాల పట్ల తటస్థంగా వ్యవహరించగలవు కానీ, లౌకికవాదులు కాలేవన్నారు.