ప్యారడైజ్‌ పేపర్ల సంచలనం. ప్రముఖుల ఆర్థిక లావాదేవీలు బట్టబయలు

ప్యారడైజ్‌ పేపర్ల పేరుతో ప్రపంచంలోని ప్రముఖుల ఆర్థిక లావాదేవీలు బహిర్గతమయ్యాయి. ఇందుకు సంబంధించి 13.40 లక్షల పత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఇంటర్నేషనల్‌ కన్సోర్టియమ్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) ఇందుకు సంబంధించిన ప్యారడైజ్‌ పేపర్లను లీక్‌ చేసింది. అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి విల్‌బర్‌ రాస్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సన్నిహితులకు చెందిన షిప్పింగ్‌ కంపెనీతో ఉన్న వ్యాపార సంబంధాలు బట్టబయలయ్యాయి. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2తో పాటు కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రుడూ సీనియర్‌ సలహాదారు స్టీఫెన్‌ బ్రౌన్ఫ్‌మన్‌ల పేర్లు కూడా ‘ప్యారడైజ్‌ పేపర్లు’ లో ఉన్నాయి. ఈ కీలక పత్రాల్లో మొత్తం 180 దేశాలకు సంబంధించిన వారి వివరాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా భారతదేశం 19వ స్థానంలో నిలుస్తుంది. మొత్తం 714 మంది భారతీయుల పేర్లు వెలుగులోకి వచ్చాయి.