కుంభమేళాపై దాడి చేస్తాం, ఐఎస్ ఆడియో క్లిప్  

కుంభమేళా, త్రిసూర్‌ పురం వంటి ఉత్సవ వేడుకలే లక్ష్యంగా భారీ విధ్వంసంతో చెలరేగుతామని ఐఎస్‌ హెచ్చరించింది. రానున్న రోజుల్లో భారత్‌లో జనసమ్మర్థంపై భారీ దాడులకు దిగుతామని పదినిమిషాల ఆడియో క్లిప్‌లో ఐఎస్‌ హెచ్చరించింది. మలయాళ భాషలో ఈ ఆడియో క్లిప్‌లు విడుదలయ్యాయని సమాచారం. భారత్‌లో ఉగ్రదాడి తప్పదని ఖురాన్‌ను ఉటంకిస్తూ ఈ ఆడియో క్లిప్‌లో పేర్కొన్నారు. లాస్‌వెగాస్‌ కాల్పుల్లో పెద్దసంఖ్యలో అమాయక ప్రజలు మరణించిన ఉదంతాన్ని ఈ క్లిప్‌లో ప్రస్తావించారు. లాస్‌వెగాస్‌ కిల్లర్‌ తమ మనిషేనని ఐఎస్‌ పేర్కొంది. మీ మేథకు పదును పెట్టండి, విషం కలిపిన ఆహారం వారికివ్వండి, ట్రక్‌లు ఉపయోగించండి, త్రిసూర్‌పురం లేదా మహాకుంభమేళాపై ప్రజలే లక్ష్యంగా విరుచుకుపడండి అంటూ ఈ క్లిప్‌లో ఉగ్రమూకలను ప్రేరేపించారు. కనీసం రైలు పట్టాలు తప్పేలా ప్రయత్నించండి, కత్తులతోనూ స్వైరవిహారం చేయంటి అంటూ ఈ క్లిప్‌లో మేల్‌ వాయిస్‌ ఉంది.