అరుణాచల్ భారత్ లో అంతర్భాగం చైనాకు స్పష్టంచేసిన ప్రభుత్వం

రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం గట్టిగా స్పందించింది. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ అంతర్భాగమని చైనాకు తెగేసి చెప్పింది. భారతీయ నేతలు ఆ రాష్ట్రంలో పర్యటించేందుకు సంపూర్ణ స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి రవీష్ కుమార్ మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, భారతదేశ నేతలు దేశంలోని మిగతా ప్రాంతాల్లో పర్యటించేందుకు ఎటువంటి స్వేచ్ఛ ఉందో, అదే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించేందుకు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. సరిహద్దు వివాదంపై భారత్-చైనా ప్రత్యేక ప్రతినిథుల సమావేశం త్వరలో జరగబోతోంది.