50శాతానికి మించి రిజర్వేషన్ల హామీ ప్రజలను పక్కదోవ పట్టించడమే. ప్రధానిమోదీ

యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెబితే అది తప్పుడు హామీయే అవుతుందని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం పరిమితిని దాటి గుజరాత్‌లో పటేల్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని తప్పుడు హామీలిస్తోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు హామీలు ఇవ్వాల్సి వచ్చినపుడు ఆ పార్టీ కపిల్‌ సిబల్‌ వంటి నేతలను రంగంలోకి దించుతుందని అన్నారు. హార్ధిక్‌ పటేల్‌ నేతృత్వంలోని పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి(పాస్)తో కాంగ్రెస్‌ ముఖ్యనేత కపిల్‌ సిబల్‌ ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. కాంగ్రెస్‌ తప్పుడు హామీలతో కొన్ని సామాజికవర్గాలను తప్పుదోవ పట్టిస్తోందని, సమాజాన్ని నిలువునా చీలుస్తోందని అన్నారు. కాంగ్రెస్‌ ఎంత దిగజారిపోయిందో ఈ ఎత్తుగడలను బట్టి తెలుస్తోందన్నారు.