వారు చేసేది జిహాద్ కాదు, పాశవిక హత్యలే – అసదుద్దీన్ ఒవైసి

asaduddin-owaisi-leader-of-muslims-in-India

ఇస్లామిక్ స్టేట్ చేసే హింస జిహాద్ కానే కాదని అవి కరడుగట్టిన హంతకులు చేసే హత్యలని హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి పేర్కొన్నారు. 144 సంవత్సరాల చరిత్ర కలిగిన అతిపురాతన ఇస్లామిక్ స్టడీస్ సంస్థ స్థాపించిన  హజ్రత్ అన్వరుల్లా ఫరూఖి వర్ధంతి సందర్భంగా గురువారం నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన ఈ విధంగా అన్నారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  “ఇప్పటికే జిహాదీ పేరుతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అనేకమంది చంపారు. అంతేకాకుండా తలలు నరకడం, సజీవంగా తగులబెట్టడం లాంటి అకృత్యాలు చేస్తున్నారు. ఈ పనులన్నీ ఇస్లాం మతానికి వ్యతిరేకం” అన్నారు.

హైదరాబాద్ లోని కొంతమంది  ముస్లిం యువత సిరియా ఉగ్రవాదుల ఉచ్చులో పడుతున్నారని, వారికి అనుభవజ్ఞులైన ముస్లింలు మార్గదర్శకం చేయాలని ఒవైసీ కోరారు.