2021లో మానవసహిత యాత్ర..

ఇస్రో మరో పెద్ద ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తోంది. అంగారక యాత్ర విజయవంతమవడంతో మున్ముందు మానవసహిత యాత్రకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. డిసెంబర్లో జీఎస్ ఎల్వీ పరీక్ష పూర్తయ్యాక మానవ సహిత యాత్రకు పూర్తి స్థాయి ప్రణాళికలు రచించనుంది. ఓ ప్రోటోటైప్ లో ముగ్గురిని ప్రయోగాత్మకంగా ఉంచి పరీక్షించేందుకు సిద్ధమవుతోంది. అన్నీ సక్సెస్ అయితే 2021 నాటికి అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ ప్రయోగంపై అంతిమంగా ప్రజలే తీర్పు చెప్పాలని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ ప్రకటించారు. మానవసహిత యాత్రతో పాటే ఇస్రో త్వరలో చందమామ, సూర్యుడిపైనా ఉపగ్రహాలకు ప్లాన్ చేస్తోంది.