మోదీ యిస్తానన్న 1000 కోట్లు ఏవి ?


హుదూద్ బాధితుల సహాయార్ధం మేమున్నాము అంటూ మోదీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు సరిగ్గా అమలు అవడం లేదు. దేశం లో ఎన్నడూ లేనట్టు గా తీవ్రమైన తుఫాను పరిణమించిన నేపధ్యం లో తెదేపా మిత్ర పక్షంగా వున్న బీజేపి అధికారం చెలాయిస్తున్నా కూడా ఇప్పటివరకూ కేవలం 400 కోట్లు మాత్రమే విడుదల చేసింది. యూనియన్ హోం మినిస్ట్రీ అధిపతి అనిల్ గోస్వామి మరొక 440 కోట్లు విడుదల చేయ్యనున్నట్టు ప్రకటించారు . తక్షణం 1000 కోట్లు ఇస్తాము అన్న మోదీ మాటలు ఏమయ్యాయి అంటున్నారు విశాఖ వాసులు.