మిమ్మల్ని స్మార్ట్ గా మార్చడానికి ఉపయోగ పడే 8 వెబ్ సైట్ లు

1. http://www.duolingo.com

ఈ వెబ్ సైట్ ద్వారా సాధారణ వ్యక్తి చాలా సులువు గా పరాయి బాష ని నేర్చుకోవడానికి వీలు ఉన్నది. సులువు గా అర్ధం చేసుకునే విధంగా సాఫ్ట్ వేర్ ని రూపొందించారు . మనం బాష నేర్చుకునేటపుడు తప్పులు చేసే అవకాశం ఉండడం తో దానికి అనుగుణం గా ఈ సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం చెయ్యబడి ఉన్నది .
Duolingo

2. www.khanacademy.com
ఖాన్ అకాడమీ గా పిలవబడే ఈ వెబ్ సైట్ ద్వారా మనకి చదువుపరం గా మంచి లభ్ది చేకూరుతుంది అని చెప్పాలి . గణితం, ఆరోగ్య శాస్త్రం, హిస్టరీ , ఆర్ధికం , కెమిస్ట్రీ , కంప్యూటర్ , ఫిజిక్స్ వంటి అనేక సబ్జెక్టు లలో ఏదైనా ఒకటి లేదా రెండు మనం ఎంచుకుని అందులో ప్రావీణ్యత సంపాదించుకోవడానికి కావాల్సిన అన్ని రకాల అవకాశాలను ఈ వెబ్ సైట్ మనకి అందిస్తుంది .

khancadamy
3. www.quora.com
‘ క్వోరా ‘ అంటూ పిలవబడే ఈ వెబ్ సైట్ మన సామాజిక అనుసంధాన వెబ్ సైట్ ఎకౌంటు ల ద్వారా లాగిన్ అవచ్చు . ఉదాహరణకి జిమెయిల్ , పేస్ బుక్ లాంటి వాటి ద్వారా క్వోరా లోకి అడుగిడి దేనిపైన అయినా ప్రశ్న వేయచ్చు . మనకి మన స్నేహితులు , చుట్టాలు , పరిచయస్తులు ఎందరో మనలాగానే ఒక ఎకౌంటు కలిగి ఉంటారు. వారితో అనుసంధానం అయ్యి వారికి సంబంధించిన ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూనే మరొక పక్క నుంచి వేరెవరైనా మనలని ప్రశ్నించిన తీరుని చూసి వారికి సమాధానం చెప్పచ్చు . ఇది ఒక గమ్మత్తైన వెబ్ సైట్ చాలా సరదా అయినది కూడా .

quora
4. www.Ted.com
టెడ్ అనగా టెక్నాలజీ , ఎంటర్టైన్మెంట్ , డిజైన్ మూడు పదాల కలయిక . ప్రపంచం లోని ఏ సమస్యకైనా టెక్నికల్ గా లేదా డిజైన్ సంబoధిoచినది అయినా వెంటనే సులభ ఉపాయం చూపించాలి అనేది ఈ వెబ్ సైట్ రూప కర్త ముఖ్య ఉద్దేశ్యం . మానవ జాతి ఎదురుకుంటున్న అనేక సమస్యలని వాటి పరిష్కారాలను ఈ వెబ్సైటు లో పొందు పరచి ఉంటారు . ఎప్పటికప్పుడు వాటిని అప్ గ్రేడ్ చెయ్యడం ద్వారా మనం వాటి సమాధానాలను కూడా చూడచ్చు .

ted
5. www.howstuffworks.com
మనం దిన చర్యలో భాగంగా వాడే ప్రతి వస్తువు ఎలా పని చేస్తుందో మనకి తెలియాల్సిన అవసరం ఉండదు . కానీ ఒకానొక సమయం లో వాటి పనితీరు పైన మనకి రకరకాల సందేహాలు కలుగుతాయి. అలాంటప్పుడు మనకి ఈ వెబ్ సైట్ సమాధానం చెబుతున్నది . ఒక వస్తువు కనిపెట్టడానికి ప్రేరేపించిన సందర్భాల నుంచీ ఆ వస్తువు తాలూకు పరిస్థితులు , పనితీరు దాకా ప్రపంచం లో గుండు సూది దగ్గర నుంచి రాకెట్ సైన్సు వరకూ అన్నీ ఈ వెబ్ సైట్ చేతిలో ఉంటాయి.

howstuff
6. www.treehouse.com
ప్రపంచం మన అరచేతిలో ఇమిడి పోయిన ఈ రోజుల్లో వ్యాపారం కూడా అంతా ఇంటర్నెట్ మయం అయిపొయింది . ఇంటర్నెట్ లో వ్యాపారం చెయ్యగల అవకాశాలు, ఇప్పటికే చేస్తున్న వారి కథలు మనం ఇందులో చూడవచ్చు.

treehouse
7. www.instructables.com
ఎవరో ఎదో కనిపెట్టారు వాటిని మనం వాడుతున్నాం అని కాకుండా దేనినైనా మనం ఎలా నిర్మించాలి అనే దాని నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ వెబ్ సైట్. ఒక MIT గ్రాడ్యుయేట్ రూపొందించిన ఈ వెబ్ సైట్ చిన్న చిన్న వస్తువుల నిర్మాణం దగ్గరనుంచి చివరకి కారుని ఎలా తయారు చేసుకోగలం వరకూ చెబుతుంది.

intructable
8. www.wikileaks.org
మన ప్రభుత్వమే మన పైన నిఘా వేసి ఉంచుతుంది. అలాంటిది మన ప్రభుత్వం పైన నిఘా వేసి ఉంచేదే వికీ లీక్స్ . వికీ లీక్స్ ద్వారా ప్రపంచం లో ఎన్నో దేశాలకి వణుకు పుట్టించాడు దాని ఓనర్ అసంజీ .. మహా మహా ప్రభుత్వాలకి దడ పుట్టించి ఆ ప్రభుత్వం చేసే నిర్వాకాలని సామాన్యులకి అందుబాటులో పెడుతుంది వికీ లీక్స్ .
సో , ఫ్రెండ్స్ చూసారు గా మనం చేతివేళ్ళ వ్యవధిలో ఎన్ని అద్భుతమైన సైట్ లు ఉన్నాయో. ఒక్క సారి ప్రయత్నించండి మరి .

wiki