మార్స్ పై క్యూరియాసిటీ కీలక అడుగు


అమెరికా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ లక్ష్యానికి దగ్గరైంది. ఎక్కడైతే అంగారక రహస్యాలు ఉంటాయని భావిస్తున్నారో ప్రస్తుతం రోవర్ అక్కడికి చేరుకుంది. మార్స్ శిలలపై అక్కడి ఆర్గానిక్ మ్యాటర్ పై క్యూరియాసిటీ శోధనలు సాగిస్తుంది. జీవం ఉందా లేదా.. ఒకప్పుడు మార్స్ పై నీటి జాడలున్నాయా లేదా అన్న విషయం తాజాగా క్యూరియాసిటీ ఉన్న కొండపైనే నిక్షిప్తమయ్యాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో క్యూరియాసిటీ రోవర్ పంపే చిత్రాలు, చేసే శోధనపై ఇప్పుడు నాసా శాస్త్రవేత్తల దృష్టి కేంద్రీకృతమైంది.