బియాస్ నది విషాదం ఎక్కడా పునరావృతం కానివ్వం – బాబు :

cbn

బియాస్ నది విషాదాన్ని మనం ఎప్పటికీ మరచి పోలేము. బియాస్ నది బాధితుల కోసం చంద్రబాబు 5 లక్షల నష్ట పరిహారాన్ని అందజేశారు. అక్కడ వచ్చిన బాధితుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి తీవ్ర ప్రమాదాలు ఇక  ఎప్పుడూ జరగకుండా చర్యలు తీసుకుంటాము అని మాట ఇచ్చారు. త్రిసభ్య కమిటీ ని ఏర్పాటు చేసిన బాబు కొన్ని గైడ్ లైన్స్ ని నిర్మించాలని వాటి అనుగుణంగానే టూర్ లు సాగేలా చర్యలు చేపట్టాలని ప్రకటించారు. ప్రతి కాలేజీ , విద్యాలయం అవి తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటాము అని చెప్పారు. బియాస్ నది లో కొన్ని నెలల క్రితం వీ ఎన్ ఆర్ విజ్ఞాన జ్యోతి కళా శాల కి చెందిన  6 ఆడపిల్లలు , 18 మంది మగ ఇంజనీరింగ్  విద్యార్ధులు చనిపోయిన సంగతి తెలిసిందే.