ఫోటో వెనక కథ


ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమి అనిపిస్తోంది ? ఒక బాలుడు బద్ధకంగా వెనక్కి కూర్చుని ఎందుకు రా బాబు మా అమ్మ నాకు అన్ని ఇలాంటి పనులే చెబుతుంది అని విసుక్కుంటూ కూరలు తరుగుతున్నాడు అనుకుంటున్నారు కదా. మన లాగానే ఈ ఫోటో తీసిన వ్యక్తి కూడా అనుకున్నాడట . నీ పేరేంటి బాబు అని అడిగితే కూడా ఆ బాబు సమాధానం ఇవ్వలేదు అట . కనీసం ఇతని వైపు కూడా చూడలేదు . వీడికి ఇంత పోగరేంటి అనుకున్నాడో ఏమో ఆ ఫోటో తీసిన అతను గ్రామస్తులని విషయం అడగగా వారు చెప్పినది విని ఇతను నిర్ఘాంత పోయాడు . అతనికి పక్షవాతం ఉంది అని శరీరం లో చేతులు తప్ప కింద భాగం ఏదీ పని చెయ్యదు అని అందుకే తన తల్లికి ఆరోగ్యం బాలేక పోతే కూరలు తరగడం లో సహాయ పడుతున్నాడు అని వారు చెప్పారు . చూసారా చుసిన వెంటనే దేనినీ అపార్ధం చేసుకోకూడదు అనడాకిని ఇది చక్కని ఉదాహరణ .