తలసాని జంప్ , తెరాస లో మంత్రి పదవి ?


టిటీడీపీ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ మరికాసేపట్లో టిడిపికి దూరం అవనున్నారు . ఆయన పార్టీ కి రాజీనామా చేసి తెరాస లో చేరబోతున్నారు. ఇవాళ కాబినెట్ విస్తరణ కూడా ఉండడం తో ఆయనకి మంత్రి పదవి తప్పని సరి అనే వాదనలు వినపడుతున్నాయి. ఎలాగైనా తెదేపా కాడర్ ని తమ వైపు తీసుకు రావాలి అనే కెసిఆర్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యింది అని చెబుతున్నారు. కాబినెట్ విస్తరణ వరకూ ఎలాంటి విషయాన్ని బయటకి తెలియనీయకుండా ఇప్పటికి ఇప్పుడు ఇలా చెయ్యడం టిటీడీపీ శ్రేణులను ఇబ్బందులకి గురిచేస్తోంది.