కిటికీల్లేని విమానాలొచ్చేస్తున్నాయ్..

విమానమంటే చిన్న కిటికీ కామన్. ఏం చూసినా అందులోనుంచే. కానీ రోజులు మారాయ్. టెక్నాలజీ పెరిగింది. ఇకపై ఫ్లైట్ జర్నీ అంటే గాల్లో తేలినట్లుందే అని పాటలు పాడుకోవాల్సిందే. కారణం విండోలు లేని ప్లేన్లు వస్తుండడమే. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ తో మీ చుట్టూ ఉన్న పరిసరాలన్నీ స్క్రీన్ గా మారిపోతాయి. స్కీన్లను పర్సనల్ కంప్యూటర్లుగా వాడుకోవచ్చు. విమానం బయట అమర్చిన కెమెరాలతో స్కీన్లపై బయటి దృశ్యాన్ని యదాతథంగా చూడొచ్చు. అంటే లోపలున్నా ఆకాశవీధిలోని అందాలను డైరెక్ట్ గా ఆస్వాదించవచ్చు. 35 వేల ఫీట్ల ఎత్తులో ఉన్నా నెట్ సర్ఫింగ్ చేసుకోవచ్చు. మరోవైపు వర్జిన్ అట్లాంటా ఎయిర్ వేస్ కూడా కొత్త ప్రయోగానికి తెర తీస్తోంది. మనం ఉన్న సీట్లోనుంచే కిందికి చూస్తే ప్రాణాలు పోయేంత పనవుతుంది. కారణం నేలను ఆకాశం నుంచి డైరెక్ట్ గా చూడొచ్చు. కింద కేవలం గ్లాస్ మాత్రమే ఉంటుంది. అదీ సంగతి.