పచ్చిపాలు తాగొద్దు

పచ్చిపాలు ఒంటికి మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు పచ్చిపాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. ఇటీవల చేసిన ఒక స్టడీలో ఈ విషయం వెల్లడైంది. పచ్చిపాలు తాగడం వల్ల ఆహారానికి సంబంధించిన విషతుల్యమైన బాక్టీరియా కడుపులోకి వెళ్లి తీవ్ర దుష్పరిణామాలు సంభవిస్తాయట. పచ్చిపాలు తాగడం వల్ల నీళ్ల విరేచనాలు, వాంతులు, కడుపులో పోట్లు, జ్వరం వస్తాయట. కొన్నిసార్లు మూత్ర పిండాలు దెబ్బతిని హఠాన్మరణం కూడా సంభవించవచ్చని ఈ స్టడీ పేర్కొంది. సూక్ష్మక్రిమిరహిత పాలు తాగడం వల్ల తలెత్తే ఆహార సంబంధమైన జబ్బుల కన్నా పచ్చిపాలు తాగడం వల్ల వచ్చే కలుషిత ఆహార జబ్బులు నూరురెట్లు ప్రమాదకరమని ‘జాన్స్‌ హోప్‌కిన్స్‌ సెంటర్‌ ఫర్‌ ఎ లివబుల్‌ ఫ్యూచర్‌ సంస్థ ’కు చెందిన బెంజమిన్‌ డేవిస్‌ తెలిపారు. ఈమధ్య కాలంలో పచ్చిపాలు తాగడం ఒంటికి మంచిదనే ప్రచారం కూడా బాగా జరిగింది. ఆ పాలల్లో సహజసిద్ధమైన యాంటీబాడీలు, ప్రొటీన్లు, బాక్టీరియా ఉన్నాయట. ఇవి సూక్ష్మక్రిమిరహిత పాలల్లో ఉన్న వాటి కంటే ఆరోగ్యకరంగా ఉంటాయట. కొన్ని రకాల ఎలర్జీలను సైతం పచ్చిపాలు తగ్గిస్తాయట. కానీ ఇవేవీ నిజం కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చిపాలల్లోని ఇన్‌ఫెక్షన్‌ కారకాలైన బాక్టీరియా ఆహారసంబంధ జబ్బులను ప్రధానంగా పిల్లల్లో, గర్భవతుల్లో, సీనియర్‌ సిటిజన్లలో, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో రేకెత్తించే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ స్టడీలో భాగంగా 1,000 ఆర్టికల్స్‌ను, 81 జర్నల్స్‌ను అధ్యయనం చేశారు. పచ్చిపాలు తాగడం ప్రమాదకరమని శాసీ్త్రయంగా నిరూపితమైందని ఈ సందర్భంగా బెంజమిన్‌ తెలిపారు