పాలతో మెదడుకు ఆరోగ్యం

మానసిక ఒత్తిడితో బాధపడుతున్నా రా..? జ్ఞాపకశక్తిలేమి మిమ్మల్ని ఇబ్బందిపెడుతోం దా..? అయితే మర్చిపోకుండా రో జూ పాలు తాగండి. ఎముకలు, కండరాలకు పాలు శక్తినిస్తాయని తెలుసు కానీ ఇదేంటీ ఎక్కడా వినలేదని ఆశ్చర్యపోవద్దు. శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం.. పాలతో మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటుందని, ఒత్తిడిని దూరం చేస్తుందని తేలింది. దాంతోపాటూ భవిష్యత్తులో అల్జిమర్స్‌, పార్కిన్సన్‌ తదితర వ్యాధులు వచ్చే ప్రమాదాన్నీ తగ్గిస్తాయట. ఈమేరకు యూనివర్సిటీ ఆఫ్‌ కాన్సస్‌ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో రోజూ పాలు తాగే వారి మెదడులో గ్లుటథియాన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ స్థాయులు పెరుగుతున్నాయని వెల్లడైంది. దీంతో మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటుందని ప్రొఫెసర్‌ డెబ్రా సుల్లివాన్‌ వివరించారు.