గుండెను ఆటంక పరిచే ఎంజైం

గుండె పనితీరును అడ్డుకొని మరణానికి కారణమవుతున్న ఎంజైమ్‌ను జాన్‌ హాప్కిన్స్‌ పరిశోధకులు కనుగొన్నారు. ప్రధానంగా గుండెకు ముప్పు కలిగించే రెండు ఎంజైములలో ఒకదాన్ని గతంలోనే కనుగొనగా.. తాజా అధ్యయనంలో పీడీఈ 9 గా వ్యవహరించే కొత్త ఎంజైమ్‌ జాడను పసిగట్టారు. గుండెపై ఒత్తిడి తగ్గించి దాని పనితీరు సాఫీగా సాగేందుకు పీకేజీ అనే ప్రొటీన్‌ తోడ్పడుతుందని వారు వివరించారు. ఈ ప్రొటీన్‌ ఉత్పత్తిని సిజీఎంపీ అణువులు నియంత్రిస్తుంటాయి. అయితే పీడీఈ 9 ఎంజైమ్‌ ఈ అణువులను ఆటంకపరచడం ద్వారా పీకేజీ ప్రొటీన్‌ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీంతో గుండె కొట్టుకోవడం ఆగిపోతుందని ప్రొఫెసర్‌ డేవిడ్‌ కాస్‌ వివరించారు.